నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరు లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 100వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. గౌడ్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీశైల దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వంగాల శివ రామి రెడ్డి, మాజీ సర్పంచ్ గోవింద రెడ్డి లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు వేణు, మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి, చిన్న కిష్టయ్య, అబ్దుల్లా పురం బాషా, రామ నర్సయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |