శ్రీశైలం జలాశయానికి సుంకేసుల ప్రాజెక్ట్ నుంచి శనివారం నీటి విడుదల నిలిపివేశారు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి వరకు శ్రీశైల డ్యామ్ కు సుమారు 1091 క్యూసెక్కుల వరద కొనసాగింది. అయితే ఎన్నో రాష్ట్రాల నుంచి తుంగభద్ర కు వరద తగ్గుముఖం పట్టడంతో శనివారం ఉదయం శ్రీశైలానికి నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో శనివారం ఉదయం 6 గంటలకు నీటి లెక్కలు కొలిచే సమయానికి ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 215. 807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 38. 5168 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. అదేవిధంగా గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గానూ 816. 80అడుగుల నీటిమట్టం నమోదైనట్టు డ్యామ్ అధికారులు పేర్కొన్నారు. కాగా శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు ఎలాంటి నీటి విడుదల జరగడం లేదు.