పెట్రోల్ డీజల్ ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను తగ్గించి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పలాస నియోజకవర్గం మందస మండల బిజెపి నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మందస మండలం భిన్నాల మదనపురం పెట్రోల్ బంకు వద్ద ఎద్దుల బండి తో తమ నిరసనను వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ల కన్నారావుఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో బిజెపి నాయకులు రౌతు చిరంజీవరావు, కొంచాడ సురేష్ కుమార్, మార్పు వెంకటేశం, ప్రధాన మన్మధరావు, బమ్మిడి ఖగేష్, నాయకులు కార్యకర్తలు పాల్గున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa