సెక్స్ జీవితం బాగుంటే మన నిత్య జీవితంలో ఎంతో ఉత్సాహంగా ఉంటాం...అది యువకుడైనా సరే పండు ముసలివాడైనా సరే అన్నది ఇప్పటి వరకు వైద్యులు తేల్చిన వాస్తవం. సెక్స్ అన్నది టానిక్ వంటిది అని కూడా వైద్యులు సంబోధిస్తుంటారు. కానీ అందుకు బిన్నమైన వాస్తవం కూడా ఓ పరిశోధనలో తేలింది. ఓ వ్యక్తి తన భార్యతో మధ్యాహ్నం సమయంలో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అతనికి తాత్కాలిక మతిమరపు వచ్చింది. హడలెత్తిన భార్య వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత డాక్టర్లు హడలెత్తారు. అతని వయసు 66 ఏళ్లు. అతనికి భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాల తర్వాత ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నేసియా(టీజీఎ) వచ్చింది అని ఐర్లాండ్ మెడికల్ జర్నల్ రిపోర్ట్ తెలిపింది. టీజీఎ అంటే అదోరకం తాత్కాలిక మతిమరపు. అతన్ని దగ్గర్లోని మాయో క్లినిక్‌కి తీసుకెళ్లారు.
మాయో క్లినిక్ ప్రకారం టీజీఎ అనేది సడెన్‌గా వచ్చే తాత్కాలిక మతిమరపు. నరాల బలహీనత వల్ల వచ్చే మూర్ఛరోగము, స్ట్రోక్ వంటి వాటితో దీన్ని పోల్చలేము అని డాక్టర్లు తెలిపారు. అంటే ఇది నరాల బలహీనత వల్ల వచ్చింది కాదన్నమాట. ఈ కేసులో మతిమరపు రావడానికి కారణం సెక్స్ అని యూనివర్శిటీ హాస్పిటల్ లిమెరిక్‌కి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూరాలజీ తెలిపింది.
ఈ కేసులో బాధితుడికి ఏడేళ్ల కిందట కూడా ఇలాంటిది జరిగిందట. ఇంతకీ అతను ఏం మర్చిపోయాడో మనకు తెలియాలి కదా. అతను గత రెండ్రోజుల్లో ఏం జరిగిందీ మర్చిపోయాడు.
సెక్స్‌లో పాల్గొన్న పది నిమిషాల తర్వాత అతను తన మొబైల్ చూసుకున్నాడు. "అరే నిన్న మా పెళ్లి రోజు ఆ విషయమే మర్చిపోయానే" అన్నాడు. వెంటనే భార్యకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే అతను ముందురోజు పెళ్లి రోజును ఘనంగా నిర్వహించాడు. తన భార్య, పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాడు. అలాంటిది ఆ విషయం అతనికి గుర్తు లేదు. అతను "నిన్న, మొన్న ఏం జరిగిందో చెప్పండి నాకేమీ గుర్తు లేదు అన్నాడు. తన భార్య, కూతుర్ని వివరాలు అడిగాడు. దాంతో భయపడిన వాళ్లు.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మొత్తంగా డాక్టర్లు తేల్చింది ఏంటంటే సెక్స్ ద్వారానే అతనికి మతిమరపు వచ్చింది. ఇలా అందరికీ జరుగుతుందా..? సెక్స్ మతిమరపును తెస్తుందా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అందువల్ల ఈ అంశంపై ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. అవి తీరాలంటే ఐర్లాండ్ మెడికల్ జర్నల్ రిపోర్ట్ మొత్తం అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది. అందులోనైనా పూర్తి వివరాలు ఇచ్చారా అన్నది తెలియదు.