ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దోమలే వారికి చికెన్ బర్గర్ గా...ఆఫ్రికాలో వింత తిండి

international |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 03:02 AM

ఆఫ్రికా అంటే మనకు  కొన్ని అంశాలే తెలుసు. కానీ అక్కడో విచిత్రమైన డిస్ ఉందటే  ఎవరైనా నమ్మగలరా...? ఆఫ్రికా అనగానే మనకు ఆకలి బాధలు, ఎడారులు, సఫారీలు, వన్య మృగాలు గుర్తు రావడం సహజం. ఇంకా చాలా గుర్తొస్తాయి. ప్రధానంగా పేదరికం నుంచి ఆఫ్రికన్లు బయటపడలేకపోతున్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు అక్కడ ఉంటున్నాయి. రష్యా లాంటి దేశాలు యుద్ధాల కోసం వేల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నాయి. ఆ డబ్బుతో ఆఫ్రికాలాంటి పేద దేశాల్లో వారి ఆకలి తీర్చవచ్చు. ఆ పని మాత్రం చెయ్యవు. తమ స్వార్థం తమదే. కానీ రెడ్ క్రాస్, ఐక్యరాజ్యసమితి లాంటి కొన్ని సంస్థలు ఆఫ్రికన్ల అభివృద్ధికి ఎంతో కొంత కృషి చేస్తున్నాయి. అలాంటి ఆఫ్రికాలో కొంతమంది దోమలతో బర్గర్ చేసుకొని తింటారని ఎంతమందికి తెలుసు?


దోమలతో బర్గర్ అనగానే "ఛిఛీ" అంటారు కొందరు. కానీ మనలా తినడానికి తిండే ఉంటే వాళ్లు వాటిని ఎందుకు తింటారన్నది ఆలోచించాల్సిన ప్రశ్న. ఆఫ్రికాలో దోమలు లేని ప్లేస్ లేదు. అది కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. గుంపులు గుంపులుగా తిరుగుతాయి. వేసవి వస్తే చాలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. వాటిని దాకలతో పట్టుకుంటారు. దాక తగలగానే దోమలకు కళ్లు తిరుగుతాయి. దాకలోనే పడిపోతాయి. 


అలా పడే దోమల్ని చేతులతో బాగా దగ్గరకు నొక్కుతారు. పదే పదే నొక్కడం ద్వారా ఆ దోమలు ముద్దలా అవుతాయి. ఆ ముద్దను నూనెలో బాగా వేపుకొని తింటారు ఆఫ్రికన్లు. అది వారికి చికెన్ బర్గర్ లా అనుకోవచ్చు. ఈ బర్గర్లు కరకరలాడతాయట. వీటిని వండేటప్పుడు ఎలాంటి మసాలాలూ వాడరు. అయినా రుచికరంగా ఉంటాయట. 


ఈ మస్కిటో బర్గర్ల ను తినడం వల్ల ఆఫ్రికన్లు ప్రోటీన్స్ పొందుతున్నారు. అంతేకాదు ఆ దోమల్లో పోషక విలువలు కూడా ఎక్కువేనని పరిశోధనల్లో తేలింది. ఒక్కో మస్కిటో బర్గర్ తయారీకి 5 లక్షల దాకా దోమలు అవసరం అని తెలిసింది. ఈ దోమల్లో బీఫ్‌లో కంటే 7 రెట్లు ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయని పరిశోధకులు తేల్చారు. ఇవి త్వరగా జీర్ణం అవుతాయని కూడా తెలిపారు. "దోమల కేకు... చికెన్ లాగే ఉంటుంది. చాలా తాజాగా ఉంటుంది. బాదం పప్పుల వాసన వస్తుంది. ఇది ఎంతో రుచికరమైన ఆహారం. ఇది ఎంతో స్వచ్ఛమైనది. బీఫ్ బర్గర్ల కంటే ఎన్నో రెట్లు ఇవి రుచికరంగా ఉంటాయి" అని ఓ ఆఫ్రికన్ తెలిపారు.


ఆకలేస్తే ఆకాశంవైపు చూసే ఆఫ్రికన్లు కోట్లలో ఉన్నారు. వారికి అడవి తల్లే ఏదో ఒక ఆహారం పెడుతోంది. ఈ దోమల్ని కూడా వారు ప్రకృతి తమకు ఇచ్చిన ఆహారంగా భావిస్తారు. ఏమీ లేని తాము ఆకలి చావులు చావడం కంటే... ఏదో ఒకటి తినడం సరైనది అని వారు భావిస్తున్నారు. తరాలుగా వారు ఇలాంటి వైవిధ్యమైన ఆహారాల్ని తీసుకుంటున్నారు. చైనాలో ప్రజలు ఎలుకలు, చింపాజీలు, పాములు ఇంకా చాలా తింటారు. వారికి అదే ఆహారం. ఆఫ్రికన్లకు ఇదే ఆహారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com