భూమి దాని చుట్టూ గ్రహాలు ఇద్దంతా వినడానికి వింతగా ఉన్నా దాని ప్రభావం మనం అపుడపుడూ చూస్తూనే ఉంటాం. తాజాగా భూమికి మరో ప్రమాదం పొంచివుందని శాస్త్రవేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భూమివైపు గ్రహశకలాలు రావడం, పోవడం కామన్. ఇప్పుడు వచ్చేది కూడా అంతే. వస్తుంది, వెళ్లిపోతుంది కూడా. కాకపోతే.. భూమిని ఢీకొట్టబోయే గ్రహశకలంగా దీన్ని చెబుతున్నారు అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా శాస్త్రవేత్తలు. గ్రహశకలం పేరు 7335 (1989 జే.ఏ.). ఈ సంవత్సరం భూమివైపు వచ్చే గ్రహశకలాల్లో ఇదే పెద్దది. దీన్ని 1989లో ఎలీనార్ హెలిన్ కనిపెట్టారు. ఇది 1.77 కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగివుంది. ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 40 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే భూమి-చందమామ మధ్య దూరం కంటే 10 రెట్లు ఎక్కువే.
అంత దూరం నుంచి వెళ్లిపోయే గ్రహశకలం గురించి మనం మాట్లాడుకోవడం అవసరమా అనే డౌట్ మీకు రావచ్చు. అవసరమే. ఎందుకంటే.. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర పాయింట్స్ ఉన్నాయి. ఇదే గ్రహశకలం మళ్లీ 2055లో భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చాలా పెద్దది కావడం వల్ల భూమిని ఢీకొట్టే ప్రమాదకర గ్రహశకలాల్లో (దీన్ని చేర్చింది నాసా. ఈ గ్రహశకలం వచ్చే దారిలో చిన్న మార్పు జరిగినా ఇది భూమివైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది గానీ ఢీకొడితే భూమి ముక్కలవడం ఖాయం. భూమికి 74 లక్షల కిలోమీటర్ల లోపున తిరిగే గ్రహశకలాల్ని ప్రమాదకర గ్రహశకలాలుగా నాసా తేల్చింది.
ఇంతకీ తాజా గ్రహశకలం ఎప్పుడు వస్తుందో చెప్పలేదు కదూ... మే 27, 2022న ఉదయం 10.26కి వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోకప్పుడు ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని భూమి తనవైపు లాక్కునే ఛాన్స్ ఉంది అంటున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. భూమి లోపల భూకంపాల వల్ల తరచూ చిన్న చిన్న ప్రళయాలు వస్తున్నాయి. కానీ అసలైన ప్రమాదం అంతరిక్షం నుంచే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. గురుగ్రహమే లేకపోయి ఉంటే ఈపాటికే భూమిని చాలా గ్రహశకలాలు ఢీకొట్టి ఉండేవని చెబుతున్నారు.