కోర్టు కేసులు అంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏవో కొన్ని కేసులు తప్పా అన్ని కోర్టు బయటే త్వరగా పరిష్కారమవుతాయని కొందరు న్యాయవాదుల వాదన. కానీ నిర్ణీత సమయం కంటే తక్కవ సమయంలో కోర్టు తీర్పులో పరిష్కారాలు లభించిన ఘటనలు ఉన్నాయి. కోర్టుకు సరైన ఆధారాలు చూపితే సమస్య త్వరగా పరిష్కరిస్తుంది. బెంగళూరులో ఓ వింత కేసులు నడుస్తోంది.
ముకేష్ కుమార్ కేడియా... బెంగళూరులోని హెచ్ ఎస్ ఆర్ లేఅవుట్ వాసి. 2016 అక్టోబర్‌లో... క్యాడ్బరీ కంపెనీకి చెందిన ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ ని రూ.89కి కొన్నాడు. దాన్ని తన మేన కోడలికి ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆ చాక్లెట్‌లో పురుగులు ఉన్నాయన్న విషయం తెలుసుకున్నాడు. అంత కాస్ట్‌లీ చాక్లెట్ కొంటే... పురుగులు ఉన్నది ఇస్తారా అనుకుంటూ క్యాడ్బరీ కస్టమర్ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. వెంటనే ఆ కస్టమర్ హెల్ప్‌లైన్ వ్యక్తి... "ఆ పురుగులు ఉన్న చాక్లెట్ బార్‌ని మాకు పంపించండి" అని చెప్పగా కేడియా అది తన దగ్గర లేదన్నాడు. కనీసం ప్రూఫ్ కోసం ఫొటో అయినా ఇవ్వాలని కోరగా అందుకు కూడా కేడియా ఒప్పుకోలేదు.
కేడియా ఆధారాలు చూపించకపోవడంతో క్యాడ్బరీ కంపెనీ వారు దీనిపై స్పందించలేదు. దాంతో కేడియా బెంగళూరు శాంతినగర్‌లోని అర్బన్ డిస్ట్రిక్ట్ వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘంని 2016 అక్టోబర్ 26న కలిశాడు. క్యాడ్బరీ చాక్లెట్ల తయారీ సంస్థ అయిన మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో క్వాలిటీ డిపార్ట్‌మెంట్ సర్వీస్ సరిగా లేదని కంప్లైంట్ ఇచ్చాడు. తనకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పరిహారం ఇప్పించాలని కోరాడు. దీనిపై సంఘంలో వాదనలు జరిగాయి. రూ.89ల చాక్లెట్ కోసం ఏకంగా రూ.20 లక్షల దాకా పరిహారం అడగడం న్యాయం కాదని మోండెలెజ్ తరపు లాయర్ వాదించారు.
అతను అడిగినంత పరిహారం ఇప్పించే అర్హతలు తమకు లేవన్న కోర్టు రాష్ట్ర వినియోగదారుల కోర్టుకు వెళ్లాలని సూచించింది. 1986 వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం కోర్టులు రూ.5 లక్షలలోపు అంశాలకు సంబంధించిన కేసుల్ని మాత్రమే వాదించగలరు. అంతకు మించిన కేసుల్ని వినియోగదారుల ఫోరం వాదిస్తుంది. ఈ ఫోరంకి కోటి రూపాయల వరకూ వాదించే అర్హత ఉంది.
ఇక ఇప్పుడు కేడియా రాష్ట్ర వినియోగదారుల ఫోరంని సంప్రదించాల్సి ఉంటుంది. ఐతే అతను ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. నోటి మాటతో చెబితే వినియోగదారుల ఫోరం లెక్కలోకి తీసుకోదు. పురుగులు ఉన్నట్లు ఫొటోగానీ, వీడియోగానీ లేదా ఫోరెన్సిక్ ఆధారాలు గానీ చూపించాల్సి ఉంటుంది. లేదంటే క్యాబ్డరీ వారు కేడియాపై పరువునష్టం దావా వేసే అవకాశం ఉంటుంది. ఐతే 2016 నుంచి ఇప్పటికే ఈ కేసులో 5 ఏళ్లు దాటాయి. మరి దీనికి వినియోగదారుల ఫోరంలో ఇంకా ఎంతకాలం పడుతుందో మరి.