శరీరానికి సరిపడా ఐరన్ అందకపోతే రక్తహీనత వస్తుంది. ఫలితంగా చిన్నపాటి అలసట, తలనొప్పి వస్తుంది. సమస్య రాకుండా ఉండాలంటే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. దానిమ్మ, అరటి, యాపిల్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరం, ఆప్రికాట్లు, ఎండు ద్రాక్షల్లో ఐరన్‌తోపాటు విటమిన్‌లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. చిక్కుళ్ళు, ఆకుకూరలు, నట్స్, డార్క్ చాక్లెట్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.