ఆదోని రాయనగర్, పర్వతాపురం ప్రాంతాల్లో సందర్శించినట్లు సీఐ విక్రమ సింహా సోమవారం విలేకరులకు తెలిపారు. ప్రార్థనా మసీదులు, దేవాలయాలు, చర్చీలను సందర్శించి అజ్ఞాత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, పిల్లల చదువు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలను తల్లిదండ్రులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా దృష్టి పెట్టాలన్నారు.