రుద్రవరం మండలం ఆయా రైతు భరోసా కేంద్రాలకు 875 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు మంజూరైనట్లు వ్యవసాయ అధికారి ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ. రుద్రవరంలోని వ్యవసాయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 100 క్వింటాలు జీలుగలు పంపిణీ చేశామన్నారు. జీలుగ విత్తనాలు కావాల్సిన రైతులు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.