ఆదోని పట్టణంలో వామపక్ష నేతలను అరెస్టు చేసినట్లు త్రీటౌన్ పోలీసులు సోమవారం తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు వామపక్ష పార్టీ నేతల పిలుపు ఇచ్చారు. ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు స్టేషన్కు నాయకులను తరలించడం సమంజసం కాదని సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు.