చాలా మంది తమ ఇంటిని ఆకర్షనీయంగా ఉంచేందుకు రకరకాల రంగులతో పెయింటింగ్ చేయిస్తుంటారు. భారీగా ఖర్చు పెట్టి పెయింటింగ్ చేసినా చివరకు అసంతతృప్తే మిగులుతుంది. అయితే పెయింటింగ్ వేసే సమయంలో 60-30-10 రూల్ పాటిస్తే మంచి రిజల్ట్ వస్తుందంటున్నారు నిపుణులు.
అసలేంటీ 60-30-10 కలర్ రూల్?
దీని గురించి మొదటి సారిగా విన్న వారు అసలేంటీ 60-30-10 రూల్ అని ఆశ్చర్యపోతుంటారు. అయితే ఇందులో ఒక్కో నెంబర్ ఒక్కో ప్రాధాన్యతను కలిగి ఉంది. మనం రంగులు వేయిద్దామనుకున్న స్థలంలో 60 శాతం ఆధిపత్య రంగులను, 30 శాతం విస్తీర్ణంలో రెండో ప్రాధాన్యత గల రంగులను మరో 10 శాతం స్థలంలో ఆకర్షణీయమైన రంగులు వేయించాలి. ఇలా మీరు ఎంచుకున్న కలర్లను ఈ పద్దతిలో వేయించడం వల్ల చూడటానికి ఆకర్శనీయంగా ఉంటుంది.