కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముదాం గల్లీ లో నివాసముండే పర్మoడి సంతోష్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. జనవరి 5న అతనికి అజ్ఞాత వ్యక్తి ఓ కంపెనీ పేరిట ఫోన్ చేసి దుబాయ్ లో మంచి ఉద్యోగం ఉందని చెప్పాడు. సర్టిఫికెట్ జిరాక్సులను పంపించాలి అన్నాడు. సర్టిఫికెట్లు పంపించాక స్కైప్ యాప్ ద్వారా ఇంటర్వ్యూలు సైతం చేశాడు. అదే నెల 23న జాబ్ ఆఫర్ లెటర్ ను, వీసా అగ్రిమెంట్ ను మెయిల్ ద్వారా పంపించాడు. వీసా అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారంగా ముందుగా ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చి రూ. 33, 720 జమ చేయాలని చెప్పారు. ఉద్యోగం వస్తుందని భావించిన సంతోష్ చెప్పిన విధంగా ఈ నెల 19న డబ్బులు వేశాడు. ఎంతకీ వీసా రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్ హెచ్ ఓ నరేష్ తెలిపారు.