పంజాబ్ నేషన్ బ్యాంక్ తన సేవలకు గానూ ఛార్జీలను భారీగా పెంచేసింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ చార్జీల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చేసింది. అలాగే పీఎన్‌బీ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) ఇ-మ్యాండేట్ చార్జీలను కూడా మార్చేసింది. అందువల్ల ఈ బ్యాంక్‌లో ఖాతా కలిగిన వారు కొత్తగా సవరించిన చార్జీలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమం.
ఆర్‌టీజీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. నెఫ్ట్ మాదిరి కాకుండా డబ్బులు డబ్బులు వెంటనే వెళ్లిపోతాయి. ఇతరుల బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి. భారత్‌లో ఇప్పటి వరకు చూస్తే ఆర్‌టీజీఎస్ అనేది ఫాస్టెస్ట్ అండ్ సేఫేస్ట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు స్లాబులను గమనిస్తే.. బ్యాంక్ ఇది వరకు బ్రాంచ్ స్థాయిలో రూ.20 చార్జీ వసూలు చేసేది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి చార్జీలు ఉండేవి కాదు. అయితే ఇప్పుడు ఈ చార్జీలు బ్రాంచ్ స్థాయిలో రూ. 24.5కు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు రూ.24 చార్జీ వసూలు చేస్తోంది. అలాగే ఇది వరకు రూ.5 లక్షలకు పైన లావాదేవీలకు అయితే బ్రాంచ్‌లో రూ.40 చార్జీ తీసుకునేది. ఆన్‌లైన్ లావాదేవాలకు చార్జీలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఈ చార్జీలు బ్రాంచ్‌లో అయితే రూ.49.5కు చేరాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు రూ.40 వసూలు చేయనుంది.
బ్యాంక్ నెఫ్ట్ చార్జీలను కూడా సవరించింది. రూ.10 వేల వరకు ట్రాన్సాక్షన్లకు ఇది వరకు ఈ చార్జీలు బ్రాంచ్‌లో రూ.2గా ఉండేవి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు చార్జీలు లేవు. అయితే ఇప్పుడు ఈ చార్జీలు బ్రాంచ్‌లో రూ.2.25కు చేరాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు రూ.1.75 చార్జీ పడుతుంది. అలాగే రూ.10 వేల నుంచి రూ.లక్షలోపు ట్రాన్సాక్షన్లకు అయితే చార్జీలు ఇదివరకు బ్రాంచ్‌లో రూ.4గా, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు జీరోగా ఉండేవి. అయితే ఇప్పుడు బ్రాంచ్‌లో చార్జీలు రూ. 4.75కు చేరాయి. ఆన్‌లైన్ లాదేవీలకు చార్జీలు రూ. 4.25 పెరిగాయి. రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ట్రాన్సాక్సన్లకు అయితే బ్రాంచ్‌లో చార్జీలు రూ.14 నుంచి రూ. 14.75కు చేరాయి. ఆన్‌లైన్ చార్జీలు ఇదివరకు జీరో అయితే ఇప్పుడు రూ.14.25 చెల్లించుకోవాలి. రూ. 2 లక్షలకు పైన అయితే ఈ చార్జీ రూ.24 నుంచి రూ.24.75కు చేరింది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు రూ.24.25 చార్జీ పడుతుంది. అంతేకాకుండా ఎన్ఏసీహెచ్ ఇ-మ్యాండేట్ ఫీజు రూ.100గా ఉంది. కాగా సేవింగ్స్ ఖాతా కలిగిన వారు ఆన్‌లైన్‌లో నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపితే ఎలాంటి చార్జీలు పడవని బ్యాంక్ తెలిపింది.