మన సమాజంలో వింత ధోరణులు మనం చూస్తునే ఉన్నాం. నేడు యావత్తు ప్రపంచం పురోగతి వైపు చూస్తున్నా ఇంకా ముద్ద అన్నం కోసం అలమటిస్తున్న ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. మన సమాజంలో మానవత్వం సైతం అటువైపు కన్నేత్తిచూడటంలేదు. పైగా శునకాలకు, జంతువులకు పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఎంతో డబ్బు ఖర్చుచేసి ఈ వేడుకలు నిర్వహించడం మరింత విడ్డూరం.
పెంపుడు కుక్కలని గారాభంగా చూసుకోవడం వాటికి పుట్టిన రోజులు చేయడం, వాటితో కేక్‌లు కట్ చేయించడం వంటి ఘటనలు చూశాం. కానీ పూణెలో ఓ వీధి కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. ఆ శునకంపై ప్రేమతో యూనివర్సిటీ విద్యార్థులు దానికి బర్త్‌డే జరిపారు. ఖండూ భాయ్ అని ముద్దుగా పిలుచుకునే కుక్కతో సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆడుకునేవారు. ఖాళీ టైంలో దానికి స్నానం చేయించేవారు. దాంతో చాలా సరదాగా గడిపేవారు.
ఆ కుక్క ఎప్పుడూ యూనివర్సిటీలో తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో దాంతో విద్యార్థులు దానిపై ప్రేమ పెంచుకున్నారు. ఈ మేరకు మే 26న ఘనంగా పుట్టిన రోజు జరిపారు. దాని కోసం ఓ పోస్టర్‌ను వేయించారు. రకరకాల యాంగిల్స్‌లో కుక్కకు ఫోటోలతో పెద్ద బ్యానర్‌ను పెట్టించారు. కేక్ తెచ్చి, పటాసులు పేల్చి.. పెద్ద హాడావిడి చేశారు. ఈ శునకం పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఖాతా కూడా ఉంది. దానిలోనే కుక్క ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. దాంతో గడిపిన ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో పంచుకునేవారు. ఒక వీధి కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరపడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
గత జనవరిలో అహ్మదాబాద్‌కు చెందిన చిరాగ్ అనే వ్యక్తి తన పెంచుకుంటున్న కుక్కకి పుట్టిన రోజు వేడుకను నిర్వహించాడు. దాని కోసం ఏకంగా ఏడు లక్షల రూపాయలను ఖర్చు చేశాడు. అంతా ఘనంగా నిర్వహించి.. తన పెంపుడు కుక్కపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ బర్త్‌డే వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చిరాగ్ కొన్ని చిక్కుల్లో కూడా పడ్డాడు. ఆ బర్త్‌డే ఫంక్షన్‌కి వచ్చిన వాళ్లు చాలామంది కోవిడ్ నిబంధనలు పాటించలేదని కేసు ఫైల్ అయింది. దాంతో ఆ కుక్క పుట్టిన రోజు వేడుకలు అప్పట్లో తెగ హల్‌చల్ చేసింది.