కేజ్రీవాల్ తనను తాను న్యాయమూర్తిగా అనుకుంటున్నారు అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై మండిపడ్డారు. మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దానిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందనను స్మృతి ఇరానీ పూర్తిగా తప్పుబట్టారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె కేజ్రీవాల్ తనను తాను న్యాయమూర్తిగా అనుకుంటున్నారని, పీపుల్స్ కోర్టు సత్యేందర్ జైన్‌కి క్లీన్ చిట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఒక కేసులో ఉన్న వ్యక్తికి ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నించారు.
2010 నుంచి 2016 మధ్య సత్యేందర్ జైన్ సుమారు 56 షెల్ కంపెనీల ద్వారా రూ.16.39 కోట్లు ల్యాండరింగ్ చేసింది నిజం కాదా.. అని స్మృతి ప్రశ్నించారు. లెక్కల్లో లేని 16 కోట్ల రూపాయల డబ్బును అంకుష్ జైన్, వైభవ్ జైన్‌లకు చెందదని ఆదాయ పన్ను కమిషనర్ చెప్పడం నిజం కాదా..? అని ప్రశ్నించారు. అలాగే సత్యేందర్ జైన్ కరాలా, చన్నీ, నిజాంపూర్, వాయవ్య ఢిల్లీలో 200 ఎకరాల భూమిని కలిగి ఉన్నారన్నది నిజం కాదా..? అని అడిగారు. అలాంటి వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగాలా..? అని విరుచకుపడ్డారు.
అంతకుముందు సత్యేందర్ జైన్ కేసుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ "పూర్తిగా తప్పుడు కేసు అన్నారు. జైన్ చాలా నిజాయితీ పరుడని, దేశభక్తి గల వ్యక్తి అంటూ సమర్థించారు. జైన్‌పై మోపిన అభియోగాలు పూర్తిగా అవాస్తవమని, ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉంటే తానే స్వయంగా అతనిపై చర్యలు తీసుకుని ఉండేవాడినని అన్నారు. అలాగే ఢిల్లీకి మొహల్లా క్లినిక్‌లను పరిచయం చేసింది ఆయనే అన్నారు. కాగా మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్‌ను ఈడీ సోమవారం అరెస్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఫ్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సత్యేందర్ జైన్ రూ.16.39 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ నిర్ధారించింది. ఈ మేరకు జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి పంపించింది.