యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో పలువురు మొదటి, రెండు, మూడో ప్రయత్నంలో విజయం సాధిస్తే మరి కొందరు మాత్రం చివరి ప్రయత్నంలో సఫలమయ్యారు. ఇలా, తుది ప్రయత్నంలో సఫలమైనవారిలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన రాష్ట్ర ప్రభుత్వ అధికారి రింకూ సింగ్ రాహేకు 683 ర్యాంకును దక్కించుకున్నారు. ప్రస్తుతం యూపీలోని హపూర్ ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ అధికారిగా ఉన్న రింకూ సింగ్ 2008లో ముజఫర్‌నగర్ జిల్లాలోని భారీ స్కాలర్‌షిప్‌ల కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో రూ.83 కోట్ల స్కాలర్‌షిప్‌లు నిధులు గోల్‌మాల్ వ్యవహారాన్ని బయటపెట్టడంతో ఆయనపై హత్యాయత్నం కూడా జరిగింది.
కుంభకోణంలో ఎనిమిది దోషులుగా తేలగా.. వీరిలో నలుగురికి 10 పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కుంభకోణం బయటపడిన కొద్ది రోజులకే రింకూ సింగ్‌పై హత్యాయత్నం చేశారు. ఏడు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆయన ముఖంపై బుల్లెట్ గాయాలయ్యాయి. దాడిలో ఆయన కంటిచూపు, వినికిడి జ్ఞానాన్ని కూడా కోల్పోయారు. ‘ఆ దాడిలో ఒక కంటిచూపును పూర్తిగా కోల్పోయాను’’ అని తెలిపాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌గా సివిల్స్ ఔత్సాహికులకు పలు సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు. ‘‘యూపీఎస్సీ పరీక్ష రాయమని నా విద్యార్థులు చెబుతూనే ఉన్నారు, వారి ప్రోద్బలంతో నేను హాజరయ్యారు.. 2004లో ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఎంపికయ్యాను.. అయితే, ఉద్యోగం చేస్తూ చదువు కోసం సమయాన్ని వెచ్చించడం కష్టంగా భావించాను.. కానీ ఎలాగైనా చదవాలని నిశ్చయించుకున్నాను’’ అని పేర్కొన్నారు.
‘‘నాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం.. స్వప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు మధ్య ఎప్పుడైనా ఘర్షణ తలెత్తితే నేను ప్రజా ప్రయోజనాలను ఎంచుకుంటాను’’ అని పేర్కొన్నారు. రహీకి భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. భవిష్యత్తులో దాడులు జరిగినప్పుడు తనను తాను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తనకు తెలుసని ఆయన చెప్పారు. దాడి సమయంలో తన వద్ద కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వివరించారు