ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన వైనం రాజస్థాన్ రాష్ట్రంలో ఉద్రిక్తలకు దారి తీసింది. రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్‌లోని ధుంచా బజార్ ప్రాంతంలో స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీష్ సోని కుమారుడు హత్యకు గురయ్యాడు. జగదీష్ సోనిపై పదునైనా ఆయుధాలతో దాడి చేశారు. దాంతో ఆయన మరణంతో దాంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చనిపోయిన వ్యక్తి నగరంలోని జగదీష్ సోని కొడుకు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రతన్‌గా గుర్తించారు.
ఈ వార్త బయటకు రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో సుభాష్ చౌక్ దగ్గర గుమిగూడి కొత్వాలి వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసులపై రాళ్లతో దాడి కూడా చేశారు. చిత్తోర్‌గఢ్ ఎంపీ చంద్ర ప్రకాష్ జోషి, బీజేపీ ఎమ్మెల్యే చంద్రభాన్ సింగ్ కొత్వాలి దగ్గరకు చేరుకుని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆందోళనకారులు చిత్తోర్‌గఢ్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో నగరంలో మార్కెట్లు మూతబడ్డాయి.
ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు సూపరింటెండెంట్ ప్రీతి జైన్ కొత్వాలి చేరుకుని విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా "రతన్ అనే యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదు. జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది" అని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కైలాష్ సంధు వెల్లడించారు. మే 31 రాత్రి జరిగిన ఈ హత్య కేసులో కొత్వాలి చిత్తోర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు చిత్తోర్‌గఢ్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.