జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవిత, సినీ, రాజకీయ చరిత్రను పుస్తకం రూపంలో ఆయన అభిమాని ఓ పుస్తకం రాశారు. ఇదిలావుంటే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీ నటుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సినీ, రాజకీయ ప్రస్థానంపై విజయనగరం జిల్లా వాసి సముద్ర గురుప్రసాద్ రాసిన రెండు పుస్తకాలను కూడా నాగబాబు ఆవిష్కరించారు. రచయితకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికారిక ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్, జిల్లా నేతలు ఇంటి రాజేశ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గురాన అయ్యాలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa