కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ కోవిడ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాను హోం క్వారంటైన్లో ఉన్నానని, తనను ఇటీవల కాలంలో కలిసిన నాయకులంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా గురువారం కోవిడ్ సోకింది.