కర్నాటకలోని కలబురిగి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారే. గోవా నుంచి బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. మృతులు అర్జున్ (37), సరళ (32), బి.అర్జున్(5), శివకుమార్(35), రవళి(30), దీక్షిత్(9), అనిత (40)లుగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa