విజయనగరం పట్టణంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కర్రోతు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో స్థానిక అశోక్ బంగ్లాలో త్రాగు నీరు సరఫరా పై పత్రికా సమావేశం నిర్వహించారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే వీరభద్ర స్వామి అన్నీ తానై ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా పట్టణంలో త్రాగు నీటి సరఫరా పై మాట్లాడే అర్హత లేదనీ, టీడీపీ కాలంలోనే అన్ని విధాలా ప్రజలు దాహోర్తిని తీర్చే చర్యలు చేపట్టామన్నారు.