ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా ఆయన కేబినెట్‌లో గల 26 మంది మంత్రుల రాజకీయ జీవిత విశేషాలపై విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన రచయిత సముద్రాల గురుప్రసాద్ రాసిన వైఎస్ జగన్ ఆస్థానం అనే పుస్తకాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం శ్రీకాకుళం ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత గురుప్రసాద్‌ను అభినందించి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు పాల్గొన్నారు.