ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సెజ్‌లో శుక్రవారం విషవాయువులు లీక్ అయ్యాయి. సెజ్‌లోనే ఉద్యోగులకు చికిత్స అందిస్తున్నారు. పలువురు మహిళా ఉద్యోగులు విషవాయువుల పీల్చి, అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తలతిరగడం వంటి సమస్యలతో స్పృహ తప్పి పడిపోయారు. గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలియడం లేదని యాజమాన్యం చెబుతోంది. ప్రమాద తీవ్రత గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.