అల్లూరి జిల్లా, ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్ధానిక కొట్నాపల్లి పంచాయితీ పందిమెట్ట గ్రామంలో జయరాజ్ అనే గిరిజనుడు మూడు పూటలా తిండి కూడా లేని విధంగా జీవనం సాగిస్తు న్నాడు.నేడు ఇంతటి దౌర్బగ్యమైన స్ధితిలో వున్నా జయరాజ్ మాట్లాడుతూ..!! నాకు ముగ్గురు ఆడపిల్లలు అందులో ఒక కూతురికి చికెన్ సులేమియా అనే వ్యాధికి గురైందనీ,నా భార్య చనిపో వడంతో పిల్లల భారం నేను చూసుకుంటున్నననీ,గతంలో నెలవారీ ఫింఛను వచ్చేదనీ,ఈ మధ్య కాలంలో అ ఫింఛను కూడా ఆపేశారని అధికారు లను అడిగితే విశాఖపట్నం కే.జి.హెచ్ ఆసుపత్రి నుండి ఒక పత్రం తీసుకురమ్మనారనీ, గతంలో నా బిడ్డను తీసికొని అనేక సార్లు వెళ్ళిన పరిష్కారం కూడా లేదని అది వుంటే ఇది వుండాలని చెప్పి తిప్పించారు తప్ప పత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మధ్య కాలంలో నేను అనారోగ్యానికి గురై నడవలేని పరిస్థితి ఏర్పడిందని,నేను ఏమైన అయిపోతే నా పిల్లలు పరిస్థితి ఆలోచిస్తేనే భయంగా వుందని,ఆర్ధికంగా కూడా ఏమి లేకపోవడం వలన నా పిల్లలు విద్యకు కూడా దూరమయ్య రంటూ దయచేసి మేము పడుతున్న ఇబ్బందులు ఇప్పటికైనా అధికారులు గుర్తించి నా బిడ్డకు ఫింఛను వచ్చేలా చేయాలని వేడుకుం టున్నారు.
నిజంగా ఏది ఏమైనప్పటికీ ఈ కుటుంబం మొత్తం తినడానికి తిండి లేక పిల్లను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఫించన్ వుంటే ఆ డబ్బులతో అయినా బిడ్డకు వైద్యం చేయించే అవకాశం వుంది అనేది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది కనుక అధికారులు వీరి సమస్యపై దృష్టి సారించి ఫించన్ పత్రాలు అందుబాటు లో లేనప్పటికీ వారు నేడు జీవనం కొనసాగిస్తున్న ఇబ్బందులను మానవత దృక్పథంతో అధికారులు గుర్తించి వీరిని ఆదుకునే విధంగా చర్యలు చేపడితే కొంత అయినా వాళ్ళ బ్రతుకులు బాగుపడుతుందనీ మరీ వీళ్ళు సమస్యలను గుర్తించి వారికి న్యాయం చేస్తరా లేదా అనేది అందరూ వేచి చూడాల్సిందే.