శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో "ప్రపంచ సైకిల్ దినోత్సవం" సందర్భంగా శుక్రవారం ఉదయం నెల్లూరు జాకీర్ హుస్సేన్ నగర్ నేతానగర్ లోని ఎస్. వి. ఆర్. స్కూల్ నుండి సత్యనారాయణ పురం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా విచ్చేసిన నవాబుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. వి. సుబ్బారావు, దిశా మహిళా స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. రామారావు మాట్లాడుతూ ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న వాహనం సైకిల్. బైక్, కారు వచ్చిన తరువాత వీటి వాడకకం తక్కువైపోయింది. సైకిల్ వాడకం వల్ల ఆరోగ్యంతోపాటు పొల్యూషన్ ను కూడా తగ్గించవచ్చునన్నారు.
ప్రతి ఇంటిలో కనీసం ఒక్క సైకిల్ అయినా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీ మోహన్ రాజు, ఎస్. వి. ఆర్. స్కూల్ కరెస్పాండంట్ అందే , ప్రిన్సిపాల్ బి. రమేష్ బాబు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు వై. చంద్ర శేఖర్ రెడ్డి, విశ్రాంత లేబర్ కమీషనర్ రాచపాలెం రఘు, అరవ రాయప్ప, జయ వెంకటేష్, కె. పవన్, కె. ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.