సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకుపోవడం వల్ల ముడతలు ఏర్పడే అవకాశం ఉందని ఆయుర్వేద వైద్యులు రమేష్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎండాకాలంలో సాధ్యమైనంతవరకు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదన్నారు. పల్చటి కాటన్ దుస్తులు తెలుపు రంగువి ధరించాలి అని అన్నారు. టోపీ లేదా గొడుగు వాడాలి అని అన్నారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెం గా తీసుకోవాలన్నారు. కొబ్బరి నీరు లేదా పల్చటి మజ్జిగ తాగాలని, పండ్లు అధికంగా తీసుకోవాలని అన్నారు. కళ్ళకు రక్షణగా నల్ల కళ్ళద్దాలు వాడాలని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.