ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ దేశంలోకి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. బాలిక నుంచి నమూనాలు సేకరించిన అధికారులు, వాటిని పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అది మంకీపాక్స్ కాకపోవచ్చని ఘజియాబాద్ జిల్లా సర్వైలైన్స్ అధికారి డా.రాకేష్ గుప్తా అభిప్రాయపడ్డారు.