పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గ పరిధిలో , దుర్గి సమీపంలో జరిగిన పార్టీల ఘర్షణలో టీడీపీ కార్యకర్త జాలయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నాయకులూ నిరసనలు కూడా చేసారు. ఈ కేసుకి సంబంధించి 9 మంది నిందితులని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ వారు తెలియజేసారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన టిడిపి కార్యకర్త జల్లయ్య గారి కుటుంబసభ్యులను చిలకలూరిపేట టీడీపీ నాయకులూ , మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించడం జరిగింది. ఈ నెల 17న నారా లోకేష్ చేతుల మీదుగా జల్లయ్య కుటుంబానికి 25లక్షల అర్థిక సహయం, ముగ్గురు పిల్లలను యన్.టి.ఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామని భరోసాఇవ్వడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa