తమ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకునే యూజర్లకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటి వరకు ఆధార్ లింక్ చేసుకోని వారికి నెలలో 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఆధార్ లింక్ చేసుకున్న వారికి నెలకు 12 టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం ఉండగా, దానిని 24 టికెట్ల వరకు పెంచింది. టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa