కనీస మద్దతు ధర లేక ఆవేదనతో ఉన్న పసుపు సాగు చేపట్టిన రైతులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. క్వింటాల్ పసుపును రూ.6,850కి కనీస మద్దతు ధరకు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 'ఈ-క్రాప్'లో నమోదు చేసుకున్న వారి నుంచి 30 వేల టన్నుల పసుపు కొనుగోలుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లను ప్రభుత్వం సేకరిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa