ప్రభుత్వ చౌక దుకాణాల డీలర్లు నిజాయితీగా పని చేయాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి కోరారు. మంగళవారం చాగలమర్రి లోని డీలర్ పివి సుబ్బన్న కు చెందిన 8 వ రేషన్ షాప్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ రికార్డులను స్టాకును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వాహనాల ద్వారా జరిగే నిత్యావసరాల వస్తువుల పంపిణీని కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ. ప్రజలకు చక్కగా, సక్రమంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యం అన్నారు.
ఎవరైనా డీలర్లు సక్రమంగా రేషన్ పంపిణీ చేయకున్నా, తూకాలలో తేడా ఉన్నా, డబ్బులు ఎక్కువ వసూలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుండి ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కమిషన్ తక్కువగా వస్తున్నదని నిజాయితీగా పని చేయకపోతే అలాంటి డీలర్లు రాజీనామా చేయవచ్చని స్పష్టం చేశారు. స్టాకిస్ట్ పాయింట్ వద్ద బస్తాల ప్రకారం బియ్యం తీసుకోవద్దని, తూకాల ప్రకారమే తీసుకోవాలని సూచించారు.