200 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు పీలేరు ఎస్ఈబి సిఐ వై. గురుప్రసాద్ తెలిపారు. పీలేరు మండలం, తలపుల గ్రామం, వడ్డేపల్లి సమీప అటవీ ప్రాంతంలో దాడులు చేసి, 200 లీటర్ల సారా ఊటను గుర్తించి, అక్కడే ధ్వంసం చేసి, కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ దాడుల్లో మదనపల్లి డిటిఎఫ్ సిఐ వెంకట లక్ష్మి, పీలేరు ఎస్ఈబి ఎస్సై లక్ష్మి నరసయ్య, సిబ్బంది పీరయ్య, సురేష్, సుధాకర్ పాల్గొన్నారు.