న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో మంగళవారం నాడు సాయంత్రం ఈడీ సోదాలు ముగిశాయి. మంత్రి ఇంట్లో 1.80 కిలోల బంగారం, రూ. 2.85 కోట్ల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. కోల్‌కత్తాకు చెందిన ఒక సంస్థకు సంబంధించిన హవాలా లావాదేవీలకు సంబంధించి ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ నివాసంలో ఈ నెల 6వ తేదీన ఈడీ సోదాలను ప్రారంభించింది.ఇవాళ సాయంత్రం ఈడీ సోదాలు ముగిశాయి. ఈడీ అధికారులు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తో పాటు అతని సహాయకుడి ప్రాంగంణంలో ఉంచిన రూ. 2.82 కోట్ల నగదు, 133బంగారు నాణెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ కస్టడీలో ఉంచాలని ప్రత్యేక న్యాయమూర్తి గీతాజలి గోయెల్ ఆదేశించారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జైన్ ఆరోగ్యం, విద్యుత్, హోం, పీడబ్యూడీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, నీటి పారుల శాఖ మంత్రిగా ఉన్నారు.కోల్‌కత్తాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హావాలా లావాదేవీలకు సంబంధించి ఢిల్లీ ఆరోగ్య మంత్రి జైన్ నివాసంలో నిన్న సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో మనీలాండరింగ్ విచారణలో మంత్రి సత్యేంద్ర జైన్ నియంత్రణలో ఉన్న రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్డ్ చేసింది.
ఆస్తుల అటాచ్ మెంట్ కోసం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ గతంలో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.2017 ఆగష్టులో మంత్రికి వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారని సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును రాజకీయ ప్రేరేపితమైందిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. గత వారంలోనే ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్ ఎన్నికల ముందే సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేస్తారని తమకు సమాచారం అందిందన్నారు. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలౌతుందని గ్రహించిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆప్ ను లక్ష్యంగా చేసుకొందని కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.2018లో ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మంత్రిని ప్రశ్నించారు.