మైదుకూరు పట్టణంలోని ఆరో వార్డు సచివాలయ పరిధిలోని వార్డు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతి సోమవారం రాత్రి తన నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రొద్దుటూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయం పై మున్సిపల్ కమిషనర్ రాముడు ను వివరణ కోరగా మృతి చెందిన విషయం తెలిసిందని, ఇతర వివరాలు తెలియదన్నారు. పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa