జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, పొడుగ్గా పెరగటానికి, నల్లగా నిగనిగలాడటానికి అమ్మాయిలు చెయ్యని ప్రయత్నం ఉండదు. వాడని ఉత్పత్తి ఉండదు. ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా ఇంకా మంచిదేమైనా కావాలి అని మనసు పీకులాడుతూనే ఉంటుంది. ఇక్కడ కొత్త, పాత అనేది అసలు మ్యాటరే కాదు. ఖర్చు తక్కువైనా, ఎక్కువైనా మీరు వాడే ఉత్పత్తి కొత్తదైనా, పాతదైనా అది మీ జుట్టుకు ఎంతవరకు ఉపయోగపడిందనేది ముఖ్యం. అంతేకానీ ఆ సెలెబ్రిటీ అది చెప్పింది, మా ఫ్రెండ్ మరొకటి చెప్పింది అని నాలుగైదు ఆప్షన్లు తీసుకోవద్దు. మీ జుట్టుకు ఏదైతే బాగా పడిందో దానినే వాడటం మంచిది.
జుట్టు ఆరోగ్యంగా ఉండి, బాగా ఎదిగేందుకు మీరు వాడే షాంపుతోనే ఒక్కసారి ఇలా చెయ్యండి. నిగనిగలాడే సిల్కీ స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది. డ్రై స్కాల్ప్ కు ఇది మంచి మందు. ఇందుకోసం మీరేం చెయ్యాలంటే, మీరు తరచూ ఉపయోగించే షాంపూ కు అర స్పూన్ కాఫీపొడిని, రెండు స్పూన్ల అలోవెరా జెల్ ను జోడించి, బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమంతో తలంటుకోవాలి. వారంలో ఒక్కసారైనా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.