కావలసిన పదార్థాలు: కుంకుమ పువ్వు (కేసర్) - అరస్పూన్, పాలు - కొద్దిగా, పెరుగు - ఒక కప్, పంచదార - ఒక కప్, పిస్తా పప్పులు - 2 స్పూన్లు, ఐస్ క్యూబ్స్ - కొన్ని.
తయారీవిధానం: పిస్తా పప్పులను నీళ్లలో పావుగంటసేపు నానబెట్టుకోవాలి. అలానే కుంకుమపువ్వును పాలలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కమ్మని తాజా పెరుగును వేసి ఒక నిమిషం పాటు గ్రైండ్ చెయ్యాలి. తర్వాత ఇందులోనే పంచదార, నానబెట్టిన పిస్తాపప్పులు, పాలలో వేసి పెట్టుకున్న కుంకుమపువ్వును వేసుకోవాలి. ఇవన్నీ మెత్తని మిశ్రమంలా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. పంచదార కన్నా పంచదార పొడిని వాడితే లస్సీ లో తొందరగా కరిగిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న లస్సీని సర్వింగ్ గ్లాసులో పోసి దానిపైన కొంచెం పిస్తా, బాదాం తురుమును వేసి, కొద్దిగా కుంకుమపువ్వును కూడా పెడితే కలర్ఫుల్ గా ఉంటుంది. అంతే...రెస్టారెంట్ స్టైల్ కేసర్ పిస్తా లస్సీ రెడీ.