బీరకాయ శరీరంలోని వేడిని తగ్గించేస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యను పోగొడుతుంది. బీరకాయలో విటమిన్ ఏ, సీ, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, వంటి పోషకాలు ఉంటాయి. జ్వరం వచ్చిన వారికి బీరకాయ పొట్టుతో చేసే పచ్చడి పెడితే వెంటనే శక్తి వస్తుంది. బీరకాయ కాలేయానికి, గుండెకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ అధిక బరువును తగ్గిస్తుంది.