గుంతకల్లు పట్టణంలోని ఒంటరి మహిళ లకు రేషన్ కార్డులు మంజూరు చేయా లని గురువారం బిజెపి ఓబీసీ మోర్చ నాయకులు తహసీల్దార్ బి. రాముకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఆ మోర్చా పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో అనేక మంది మహిళలు భర్త లతో చట్టప్రకారం విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నారన్నారు. రేషన్ కార్డులు లేని కారణగా వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ సరుకులు అందడం లేదన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో బిజెపి సీనియర్ నాయకుడు బండారు కృష్ణమూర్తి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్య క్షుడు గోవిందరాజులు, పట్టణ కార్యదర్శి సతీష్ చౌదరి, మహిళా మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి పద్మ తదితరులు పాల్గొన్నారు.