జిల్లాలో ఇటీవల మృతి చెందిన హోంగార్డు నిర్మలా దేవి కుటుంబానికి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి రూ. 9. 35 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఎక్స్ గ్రేషియా కింద రూ. 5 లక్షలు. జిల్లా హోంగార్డుల ఒక రోజు జీతంకు సంబంధించి రూ. 4. 35 లక్షలు మొత్తం రూ. 9. 35 లక్షలను 2 చెక్కుల రూపంలో నిర్మలాదేవి కుమారుడు విష్ణువర్ధన్ , కూతురు ప్రమీలాదేవిలకు అందజేశారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, హనుమంతు (ఏ. ఆర్ ), ఆర్ ఐ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.