రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లు వాల్తేర్ సీనియర్ నడపనున్నట్లు డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 10న బద్రక్- గుంటూరు (08401) పరీక్షా ప్రత్యేక రైలు రాత్రి 9గంటలకు బర్రక్ లో బయలు దేరి మర్నాడు ఉదయం 6.35 గంటలకు విశాఖ చేరుకొని ఇక్కడి నుంచి 6.55 గంటలకు బయలు దేరి మధ్యాహ్న1.30 గంటలకు గుంటూరు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 11న గుంటూరు- బధ్రక్ (08402) రైలు 8 గంటలకు గుంటూరులో బయల్దేరి తెల్లవారుజాము 2.30 గంటలకు విశాఖకు రానుంది.
ఈనెల 11న భువనేశ్వర్- తాంబరం (08407) పరీక్షా ప్రత్యేక రైలు ఉదయం 10.30 గంటలకు భువనేశ్వర్లో బయలు దేరి సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకొని 5.35 గంటలకు బయలు దేరి మర్నాడు ఉదయం 7.15 గంటలకు తాంబరం చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08408) 12వ తేదీ రాత్రి 10.30కు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11.45 గంటలకు విశాఖ రానుంది. ఈనెల 11న షాలిమార్ - సికింద్రాబాద్(08005) ప్రత్యేక రైలు ఉదయం 6 గంటలకు షాలిమార్ బయలు దేరి అదే రోజు రాత్రి 8.25 గంటలకు విశాఖ రానుంది. 8.45 గంటలకు ఇక్కడ నుంచి బయల్దేరి మర్నాడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ వెళ్లనుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08006) ఈనెల 14న మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మర్నాడు ఉదయం 5.20 గంటలకు విశాఖ రానుంది.