కల్తీ ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్న కిచెన్ గార్డెన్ హోటల్ ని సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి. రామచంద్రుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కిచెన్ గార్డెన్ లో హోటల్ లో ఆహారం కల్తీ జరిగిందని సాక్షాత్తు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలియజేసి, కల్తీ ఆహారం బయట పెట్టిన కూడా అధికారులు ఎందుకు ఇంత వరకు ఆ హోటల్ ను సీజ్ చేసి యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ఆయన డిమాండ్ చేశారు.