మండల కేంద్రం కొలిమిగుండ్ల ప్రధాన రహదారిపైన ఉన్న బ్రిడ్డి కింద భాగంలోని ఎర్రవాగులో పూడికతీత పనులు పూర్తయ్యాయి. కొన్ని నెలలుగా వాగులో చెత్తచెదారంతో నిండి మురిగునీరు నిల్వకావడంతో దుర్వాసనకు సమీప కాలనీల ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రజల విన్నపం మేరకు రామ్‌కో సిమెంట్ కంపెనీ సామాజిక బాధ్యతగా మూడు రోజుల పాటు ప్రాక్లెయినర్‌తో పూడిక తొలగింప చర్యలు చేపట్టారు. మురుగునీరు సాఫీగా సరఫరా అయ్యేలా అడ్డంకులను కూలీలు తొలగించారు. అయితే చాలా మంది ఇళ్లు, దుకాణాల్లోని చెత్త, చెదారాన్ని సంచుల్లో తీసుకొచ్చి మళ్లీ వాగులో వేస్తున్నారు. పంచాయితీ అధికారులు బ్రిడ్జి పక్కలో కుండీలను ఏర్పాటు చేయించి అందులో చెత్తచెదారం వేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.