కర్నూలు నగరంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నాలుగవ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం సంతోష నగర్ హైవేలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో బియ్యం పట్టుబడింది. కర్నూలుకు చెందిన వినోద్, నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సర్వేష్ రాఘవేంద్ర కలిసి బొలెరోలో 30 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.