ప్రతి ఒక్కరూ ఆంగ్ల భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించటం అవసరమని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె. ఎల్లప్పు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. జయరాజు అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోనెగండ్లలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను ప్రారంభించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంగ్ల భాషకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. 20 రోజులపాటు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తామన్నారు.