పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో వరుసగా తొమ్మిది హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండవ వన్డేలోనూ బాబర్ 77 రన్స్ చేశాడు. దీంతో బ్యాటింగ్ రికార్డు బుక్కుల్లో బాబర్ ఎక్కాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్టుతో బాబర్ హాఫ్ సెంచరీల రికార్డు మొదలైంది. ఆ టెస్టులో అతను 196 రన్స్ చేశాడు. ఆ తర్వాత మూడవ టెస్టులో 66, 55 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ బాబర్ హోరెత్తించాడు. తొలి మ్యాచ్‌లో 57 స్కోర్ చేయగా, ఆ తర్వాత 114, 105 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ఆసీస్‌తో జరిగిన టీ20లో 66 రన్స్ స్కోర్ చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించిన బాబర్.. రెండవ వన్డేలోనూ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో వరుసగా 9 హాఫ్ సెంచరీలు చేసిన ఘనతను బాబర్ సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేసి కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.