ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్..వీడియో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 04:17 PM

ఒంటి మీద  యూనిఫాం పడగానే అసలు కర్తవ్యాన్ని కొందరు పోలీసులు  మర్చిపోతున్నారు. తమ తీరుతో పోలీస్ శాఖకు  మచ్చతీసుకొస్తున్నారు. తిరుపతిలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. అన్నమయ్య సర్కిల్ మద్యం సేవించిన ఓ వ్యక్తి పట్ల దారుణం ప్రవర్తించాడు.. ఓవరాక్షన్‌తో బూటు కాలితో తన్నారు. కానిస్టేబుల్ కర్రతో దాడి చేయగా మద్యం సేవించిన వ్యక్తి కర్రను గట్టిగా పట్టుకోవడంతో మరింత రెచ్చిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయి కాలితో తన్నాడు. ఈ దాడి ఘటనను కొంతమంది వాహనదారులు మొబైల్‌లో రికార్డ్ చేయడంతో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా చేయడం సరికాదంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa