శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలానికి వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ నేతలు పేర్కొనగా వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుంపర్తి పరమేష్ ను ధర్మవరం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఏలాంటి ఆందోళనలు ఉండరాదని ముందస్తు అరెస్టు చేశారు.