జరుగుమల్లి మండల పరిధిలోని కామేపల్లిలో కొలువై ఉన్న పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ మంగళవారం ప్రారంభమైంది. తిరునాళ్ళ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు. 16వ తేదీ వరకు తిరునాళ్ల నిర్వహిస్తున్నట్లు ఈవో ఆర్. శివశంకర్ తెలిపారు. భక్తులకు అన్నదానం చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈవో సూచించారు.