తాగునీటి కోసం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొప్పోలు గ్రామస్తులు రోడ్డెక్కారు. గత 15 రోజుల నుంచి తమకు మంచినీటి సరఫరా లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ నీరు ఉండే కొప్పోలు చెరువును అధికార పార్టీ నాయకులు చేపల చెరువు గా మార్చి తమకు నీళ్లు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా వారు ఖాళీ బిందెలతో ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు